Entertainment

యుఎస్ఏ లో ‘సీతారామం’ యూనీక్ రికార్డు …. ! |



యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన తాజా సినిమా సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమకథగా లవ్, రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. రష్మిక మందన్న ముఖ్య పాత్ర చేసిన ఈ మూవీ పై పలువురు ప్రేక్షకులతో పాటు అనేకమంది సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ మూవీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల తోపాటు అటు యుఎస్ఏ లో సైతం భారీగా కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇప్పటికే యూఎస్ఏ లో 300కె డాలర్స్ కి పైగా కొల్లగొట్టిన సీతారామం మూవీ, గడిచిన 50 రోజుల్లో అక్కడ ఏ మూవీకి దక్కని అత్యధిక డే 1 గ్రాస్ కలెక్షన్ ని దక్కించుకుని ఒక యూనీక్ రికార్డు సొంతం చేసుకుంది. హను రాఘవపూడి అద్భుతమైన టేకింగ్, ఆకట్టుకునే కథ, కథనాలు, లవ్, ఎమోషనల్ సన్నివేశాలు, సాంగ్స్, బీజీఎమ్, హీరో హీరోయిన్స్ పాత్రల తోపాటు ప్రతి పాత్ర ఆడియన్స్ మనసుని తాకి సీతారామం మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసాయి. ఇక తమ మూవీకి అన్ని ప్రాంతాల నుండి మంచి ఆదరణ లభిస్తుండడంతో సీతారామం యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published.