Entertainment

“భలే భలే బంజారా” కి చిరు – చరణ్ అద్దిరిపోయే స్టెప్పులు |


ఆచార్య నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరు – చరణ్ ల సాంగ్ భలే భలే బంజారా తాజాగా విడుదల అయ్యింది. భలే భలే బంజారా అనే టైటిల్ తో రూపొందిన ఈ పాటను మణిశర్మ స్వరపరచగా, శేఖర్ మాస్టర్ చక్కగా కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇద్దరు కూడా అద్దిరి పోయే స్టెప్పులు వేశారు. ఈ పాటకు స్టైలిష్ గా మరియు క్లాస్ గా స్టెప్పులు ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఫ్యాన్స్ నుండి, నెటిజన్స్ నుండి ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ను ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ పాట రానున్న రోజుల్లో మంచి హిట్ అవుతుంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published.