Entertainment

“జనగణమన”ను విజయ్‌తో చేయాలని పూరి డిసైడ్? |


డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో హ్యాట్రిక్ చిత్రంగా “జనగణమన” అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల మహేశ్ బాబు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్‌తో ఈ సినిమాని తీయాలని పూరి భావించినా అది వర్కౌట్ కాలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ని పక్కకి పెట్టిన పూరి ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో “లైగర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ పూరి “జనగణమన”కి సంబంధించి ఓ వార్త తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండతో పూరి “జనగణమన” సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడని టాక్ వినిపిస్తుంది. స్క్రిప్ట్ అల్రెడీ సిద్దంగా ఉండడంతో విజయ్‌తోనే ఈ సినిమా పూర్తి చేయాలని పూరి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే వచ్చే నెలలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published.